హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదు గ్రామాలు ఏకగ్రీవం.. 13 చోట్ల పోలింగ్

KKD: పెదపూడి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల ప్రత్యేక అధికారి వరప్రసాదరావు, ఎంపీడీవో నరేంద్రరెడ్డి తెలిపారు. నవంబర్ 29న మండలంలోని 18 గ్రామాల్లో 13 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐదు గ్రామాలు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. శనివారం ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.