హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BSF జవాన్ మృతిపై జగన్ సంతాపం

E.G: అసోం రాష్ట్రంలోని భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన BSF జవాన్ కదిమి వేణు మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్‌కు నివాళులర్పించారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేణు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.