హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

29న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్: కలెక్టర్

E.G: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.