హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రిని కలిసిన జడ్పీ ఛైర్‌పర్సన్

కోనసీమ: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమూల్య తొలిసారిగా రామచంద్రపురంలో మంత్రి సుభాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలువురు జిల్లా ప్రముఖులను కలిసి వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని అమూల్య పేర్కొన్నారు. పెద్దల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.