హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు

HNK: మైనర్ బాలికను పలుమార్లు వేధింపులకు గురిచేసిన యువకుడిపై గురువారం హసన్‌పర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు.