KMM: మద్యం మత్తులో వాహనాలు నడిపిన ఏడుగురికి శుక్రవారం దమ్మపేట కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించింది. జడ్జి భవాని ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా, మరో ఇద్దరికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఏడుగురికి జైలు


