హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు మహాభారతం పుస్తకాల పంపిణీ

NGKL: అచ్చంపేట మండలం పల్కపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం 70 వ్యాస మహాభారతం పుస్తకాలను పంపిణీ చేశారు. కాంచీపురం శ్రీ వ్యాసభారత భాషా సాంస్కృతిక ట్రస్ట్ వీటిని అందించింది. పద్య పఠన కార్యక్రమం కోసం రోజూ మహాభారత, భాగవత పద్యాలు సాధన చేయిస్తున్నట్లు తెలుగు టీచర్ సాయిజ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ప్రమీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.