హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు విలువపై అవగాహన పెంచేందుకే పోటీలు: కలెక్టర్

VZM: భవిష్యత్ ఓటర్లలో చైతన్యం నింపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా స్థాయిలో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన 20 మంది విద్యార్థులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ప్రశంసాపత్రాలు అందించారు. ఓటు విలువపై అవగాహన పెంచేందుకు ఈ పోటీలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, డీఆర్వో సత్తిబాబు పాల్గొన్నారు.