హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాల నిర్మూలనకు కొవ్వొత్తుల ర్యాలీ

ELR: ఏలూరు బాల్య వివాహాలు చిన్నారుల భవిష్యత్తును చీకటిలోకి నెడతాయని జిల్లా జడ్జి ఎన్. శ్రీ లక్ష్మి అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై ఏలూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కొవ్వొత్తి ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.