హైదరాబాద్: 28°C
క్రీడలు

TA T10 లీగ్ అంబాసిడర్‌గా సంయుక్త మీనన్

తెలుగు రాష్ట్రాల్లో టెన్నిస్ బాల్ క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు TA T10 లీగ్ రాబోతోంది. తాజాగా ఈ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ సంయుక్త మీనన్‌ను నిర్వాహకులు ప్రకటించారు. సంయుక్త చేరికతో లీగ్‌కు మరింత ప్రమోషన్ లభిస్తుందని ఆశిస్తున్నారు. గ్రామీణ, పట్టణ క్రీడాకారులకు పెద్ద వేదిక కల్పించడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.