హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో మలేషియాపై 6-2 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన 5 మ్యాచ్‌లలోనూ గెలిచిన భారత్, సెమీఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రేపు రాత్రి 7 గంటలకు జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడనుంది.