సిరాజ్‌ను తప్పించడంపై విమర్శలు వస్తుండగా.. వసీం జాఫర్ భిన్నంగా స్పందించాడు. కోచ్ గంభీర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. 'సిరాజ్ తుది జట్టులో ఉండాలని అందరూ అంటున్నారు. అయినప్పటికీ, బయటి ఒత్తిడికి తలొగ్గకుండా తమ నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి అపార దృఢ సంకల్పం కావాలి. అందరూ వ్యతిరేకిస్తున్నా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ధైర్యం అందరికీ ఉండదు' అంటూ గంభీర్‌ను జాఫర్ సమర్థించాడు.
క్రీడలు
గంభీర్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే: జాఫర్


