హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్యవివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

VSP: బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది సూచించారు. శుక్రవారం పెందుర్తి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాల నివారణ, బాలల హక్కులు, పోక్సో చట్టం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్ సేవలను వివరించారు.