కృష్ణా: ఒకే కుటుంబానికి 3 పదవులు దక్కడం ఆసక్తికరంగా మారింది. పెడన మండల నందిగామ పంచాయతీ పరిధిలోని దావోజిపాలెంకు చెందిన కాగిత నాగేశ్వరరావు PACS అధ్యక్షుడిగా, ఆయన భార్య కాగిత లక్ష్మి ZPTC సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా నాగేశ్వరరావు తల్లి కాగిత శాంతకుమారి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబంలో 3 కీలక పదవుల చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
ఒకే కుటుంబానికి 3 కీలక పదవులు


