హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపే నవోదయ ప్రవేశ పరీక్ష

KMM: భద్రాద్రి జిల్లాలో రేపు జరిగే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు 1,657 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు శుక్రవారం DEO శంభుప్రసాద్ తెలిపారు. ఇందుకోసం చర్ల, భద్రాచలం2, బూర్గంపాడు, అశ్వారావుపేట, కొత్తగూడెం2, ఇల్లందు ప్రాంతాల్లో మొత్తం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు 8 మంది CSOలు, 80 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు.