హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుభీర్ రోడ్డు పక్క షెడ్లకు నోటీసులు జారీ

NRML: కుభీర్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద R&B రహదారికి ఇరువైపులా 50 అడుగుల పరిధిలో నిర్మించిన షెడ్లను మూడు రోజుల్లో తొలగించాలని గ్రామ పంచాయతీ EO జాదవ్ మాధవ్ శుక్రవారం యజమానులకు నోటీసులు జారీ చేశారు. వాహనాలు, పాదచారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రమాదాలు నివారించేందుకే ఈ చర్య అని తెలిపారు. తొలగించకపోతే 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.