హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఖేలో ఇండియా పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

MBNR: జిల్లా యువతలో నూతన ఉత్సాహాన్ని నింపేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా డిసెంబర్ 17 నుంచి 22 వరకు మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.