హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయినవిల్లి విఘ్నేశ్వరుడి ఆలయానికి రూ.3.12 లక్షల ఆదాయం

కోనసీమ: అయినవిల్లి మండలంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం 469 మంది భక్తులు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. 127 లఘున్యాస అభిషేకాలు, 43 లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. 2,714 మందికి అన్నప్రసాదం, 2,081 లడ్డూలు పంపిణీ చేశారు. ఆలయానికి మొత్తం రూ.3,12,876 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.