హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చౌడూరు సర్పంచ్‌గా యేరాసి సుష్మారెడ్డి ఏకగ్రీవం

KDP: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా యేరాసి సుష్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఆమెకు డిక్లరేషన్ ఫారం అందజేశారు. సుష్మారెడ్డి‌కి గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని సుష్మారెడ్డి తెలిపారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.