హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆందోల్ మైసమ్మ ఆలయానికి రూ.16.14 లక్షల ఆదాయం

BHNG: దండు మల్కాపురం పరిధిలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 135 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.16,14,027 ఆదాయం వచ్చినట్లు ఈఓ సల్వాది మోహన్ బాబు తెలిపారు. ఇందులో రూ.15,32,250 నగదు, రూ.81,777 నాణేలు ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంచర్ల అశ్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.