SRD: సంగారెడ్డి జిల్లాలో ఈనెల 28న నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు DEO రోహిణి తెలిపారు. జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో 1,756 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
తెలంగాణ
రేపు నవోదయ ప్రవేశ పరీక్ష


