హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనుమలోపల్లిలో భారీ చోరీ

KDP: సిద్ధవటం మండలం కనుమలోపల్లిలో రామకృష్ణారెడ్డి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 400 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు. గురువారం బాధితులు బద్వేలుకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని నగలు కనిపించలేదు. అపహరణకు గురైన ఆభరణాల విలువ రూ. 50 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు.