NLG: ఈద్గా వద్ద హజ్రత్ సయ్యద్ షావలి ఉర్సు ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ అధ్యక్షతన వేడుకలు జరిగాయి. మధ్యాహ్న ప్రార్థనల అనంతరం అన్నదానం నిర్వహించారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో ఐక్యంగా ఉండాలని ప్రార్థించినట్లు శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో మసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ఉర్సు ఉత్సవాలు


