హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

SDPT: తొగుట మండలం రాంపూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు పాల్గొని విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలను అరికట్టి, బాలల హక్కులను కాపాడుతూ బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.