SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 8వ వార్డు చిన్నబాడం క్రిస్టియన్ ప్రార్థనా మందిరంలో పాస్టర్ డి.వి.డి.వి. కుమార్ బోస్ ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఉచిత కుట్టు శిక్షణ నిర్వహించారు. శుక్రవారం శిక్షణ పొందిన 27 మంది మహిళలకు సుమారు రూ.3.65 లక్షల విలువైన కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు. కౌన్సిలర్ సనపల సుజాత సీతారాం, పట్టణ అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ


