హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు: SI తేజస్విని

SRPT: నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామంలో రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల కలిగే ప్రమాదాలపై ఎస్ఐ తేజస్విని శుక్రవారం సాయంత్రం రైతులకు అవగాహన కల్పించారు. రహదారులపై ధాన్యం పోయడం వల్ల ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందని, రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దని సూచించారు.