హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల రహిత పంచాయతీగా హసీంపూర్ ఎంపిక

ADB: భోరాజ్ మండలంలోని హసీంపూర్ గ్రామపంచాయతీ బాల్య వివాహాల రహిత పంచాయతీగా ఎంపికైంది. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా సర్పంచ్ గాజుల విజయ, పంచాయతీ కార్యదర్శి ముగ్ద ప్రశంసా పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, DSWO సునీత, తదితరులు ఉన్నారు.