హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా ఇక్బాల్పూర్ రోడ్డు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఇక్బాల్పూర్ వద్ద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. తారు లేచిపోయి పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు చేరి ప్రమాదాలు పెరుగుతున్నాయి. రాత్రివేళ ప్రయాణం మరింత భయానకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.