హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టిన సర్పంచ్

MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ నిర్మాణ పనులకు ముగ్గు పోశారు. గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృషితో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, సెక్రటరీ ధనలక్ష్మీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.