హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలప స్మగ్లింగ్ వెనుక సూత్రధారులు ఎవరు?

MLG: కన్నాయిగూడెం మండలం దేవాదుల వద్దే ఈ నెల 16న జిట్రేగి కలప లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడిన ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. కలప రవాణా వెనుక స్థానిక గుర్రేవుల గ్రామానికి చెందిన మహిళతో పాటు జయశంకర్ జిల్లాకు చెందిన మరొక మహిళ హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. అటవీ శాఖ అధికారుల విచారణ తీరుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.