హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

తమిళనాడు సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెరంబూర్ నుంచి ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని విజయ్ కోరగా.. న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. నామినేషన్‌లో స్థిరాస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని ఆరోపిస్తూ పెరంబూర్‌కు చెందిన ఓటరు దినేష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. విజయ్ పిటిషన్‌ను కొట్టివేశారు.