హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయవరం సర్పంచ్ ఎన్నికపై వివాదం

KDP: కడప జిల్లా రాయవరం సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మచ్చా లక్ష్మీనారాయణ జిల్లా పంచాయతీ అధికారి కే. రామచంద్రయ్య కు ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపులో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఎన్నికలు రద్దు చేసి రీ ఎలక్షన్ నిర్వహించాలని కోరారు. ఫిర్యాదు పరిశీలించి అవసరమైన న్యాయపరమైన చర్యలను తీసుకుంటామని అధికారి తెలిపినట్లు వెల్లడించారు.