హైదరాబాద్: 28°C
తెలంగాణ

'AILU జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి'

SRPT: ఈ నెల 29న కోదాడ పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించే AILU సూర్యాపేట జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు వేజల్లా రంగారావు పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ కోర్టులో న్యాయవాదులతో కలిసి మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. న్యాయవాదుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి AILU కృషి చేస్తోందని తెలిపారు.