హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి'

అన్నమయ్య: సుండుపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లి సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని స్వతంత్ర అభ్యర్థి నంద్యాల రోజా ఆరోపించారు. తాము గెలిచినా ప్రత్యర్థికి ఒక్క ఓటు మెజార్టీతో విజయం ప్రకటించారని పేర్కొంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.