హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏసీబీ వలలో ఏలూరు ఎంఆర్ఓ

ELR: ఏలూరు తహసీల్దార్ ఎంఆర్ఓ రవీంద్రనాథ్ రూ. 10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పని నిమిత్తం ఏలూరుకు చెందిన గోపాలం నుంచి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు వలపన్ని లంచం తీసుకుంటున్న సమయంలో ఎంఆర్ఓను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.