డీలిమిటేషన్ బిల్లు విషయంలో తమ వైఖరి ఏ మాత్రం మారలేదని డీఎంకే అధినేత స్టాలిన్ వెల్లడించారు. నియోజకవర్గ పునర్విభజనతో వచ్చే దుష్ఫలితాలపై దేశంలో తొలుత గళం విప్పింది తామేనని పేర్కొన్నారు. ఒకవేళ పార్లమెంట్ స్థానాలను పెంచాలనుకుంటే.. తమిళనాడుకు ఇప్పుడున్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని తెలిపారు. 1971 నాటి పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లు యథాతథంగా కొనసాగించాలన్నారు.
వార్తలు
మా వైఖరి ఏ మాత్రం మారలేదు: స్టాలిన్


