హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు దీపం వెలిగించాల్సిందే: సుప్రీంకోర్టు

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వివాదం విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు దీపం వెలిగించాలని తేల్చిచెప్పింది. ఈ కొండపై ఉన్న రాతి స్తంభంపై దీపం వెలిగించాలని సుప్రీం గతంలో చెప్పినప్పటికీ.. ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగించారు. దీంతో సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.