హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా బుల్లెట్ రైల్వేస్టేషన్

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 2027 మేలో సూరత్-బిలిమోరా సెక్షన్ ట్రయల్ రన్‌కు సిద్ధమవుతోంది. ట్రయల్ రన్‌లో గంటకు 280 కిలోమీటర్ల వేగంతో రైలును నడపనున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక ఇంటీరియర్స్, ఎస్కలేటర్లు, సెంట్రలైజ్డ్ ఏసీతో ఈ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు.