ELR: ఉంగుటూరు మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు చివరి రోజు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచాలతో ప్రచారం హోరెత్తింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నం చేసారు.
ఆంధ్రప్రదేశ్
మండలంలో ముగిసిన ఎన్నికల ప్రచారం


