ASF: వాంకిడి మండలంలో 1976 తర్వాత వలస వచ్చిన లంబాడీలకు ST కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని శుక్రవారం తుడుందెబ్బ నాయకులు MRO కవితకు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు పంద్రం సురేశ్ మాట్లాడుతూ.. ST సర్టిఫికెట్లు జారీ చేస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీల హక్కులు, రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ అవకాశాలను కాపాడాలని కోరారు.
తెలంగాణ
'లంబాడీలకు ST కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దు'


