హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ సమాధానం చెప్పాలి'

ATP: గత ఐదేళ్లలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని MLA కాలవ శ్రీనివాసులు విమర్శించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, పేరూరు, భైరవానితిప్ప ప్రాజెక్టులను పక్కనపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పేరుతో ప్రజాధనం వృథా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం హంద్రీ-నీవాపై రూ.3,000 కోట్లు ఖర్చు చేసి, రూ.1,100 కోట్లతో రెండో దశ పనులు చేపడుతోందని తెలిపారు.