హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దగ్గవోలు సర్పంచ్‌గా కోలా పుల్లమ్మ ఏకగ్రీవం

TPT: డక్కిలి మండలం దగ్గవోలు గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. అదే గ్రామానికి చెందిన కోలా పుల్లమ్మను సర్పంచ్‌గా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా పుల్లమ్మ గ్రామానికి రూ.28 లక్షలు విరాళంగా అందజేసినట్లు పేర్కొన్నారు. జనరల్ మహిళలకు కేటాయించిన ఈ పంచాయతీలో యువత కీలక పాత్ర పోషించారు.