హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

PLD: ఈ నెల 29న జరగనున్న రెండో విడత ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని SP జగదీశ్ అదహళ్లి సూచించారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లను బెదిరించినా, ప్రలోభపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవంబర్ 27 సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ ఉదయం వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించినట్లు వెల్లడించారు.