CTR: బాల్యవివాహాలతో అనేక అనర్థాలు ఎదురవుతాయని ICDS సూపర్‌వైజర్ మల్లీశ్వరి తెలిపారు. సదుం మండలంలోని చెరుకువారిపల్లె సచివాలయం, జోగివారిపల్లె అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన వయసు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని ఆమె సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాల్యవివాహాలతో అనర్థాలు: ICDS


