హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉమ్మడి జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్ష

సత్యసాయి: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నవంబర్ 28న 24 పరీక్ష కేంద్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 5,548 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,220 మంది బాలురు, 2,328 మంది బాలికలు ఉన్నారు. తల్లిదండ్రులు ఉదయం 11 గంటలకే విద్యార్థులతో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని నవోదయ ప్రిన్సిపాల్ సూచించారు.