హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి

AKP: రేగుపాలెం జంక్షన్ వద్ద లారీ నుంచి ఇనుప కట్ట పడి విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రికి పోలీసులు వివరించారు. అనంతరం జంక్షన్ వద్ద వెంటనే సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.