KKD: సముద్రంలో వేటకు వెళ్లి 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ నెల 8న వేటకు వెళ్లగా.. 14న బోటు ఇంజిన్ పాడైంది. మంచినీరు అయిపోవడంతో వర్షపు నీటితో ప్రాణాలు కాపాడుకున్నారు. స్వయంగా ఇంజిన్ మరమ్మతు చేసుకుని వస్తుండగా కోస్ట్ గార్డుల సాయంతో క్షేమంగా తిరిగిరావడంతో కుటుంబాల్లో ఆనందం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
18 రోజుల పోరాటం.. క్షేమంగా చేరిన మత్స్యకారులు


