VZM: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆరోపించారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎం. బూర్జవలసలో ఏడు బ్యాలెట్ ఓట్లపై అవకతవకలు జరిగాయని, దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తమ పార్టీ 40 శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎన్నికల్లో అక్రమాలు.. హైకోర్టును ఆశ్రయిస్తాం'


