హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో రైలు ప్రమాదంలో మహిళ మృతి


GNTR: తెనాలిలో రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతురాలు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన ఇరుగు వెంకటమ్మగా గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె మృతిపట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.