హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరి కోతల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థన

ASR: జీ.మాడుగుల మండలంలోని భీరం పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిని బోయిని సత్యకుమారి శుక్రవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చరియ గ్రామంలో వరి కోతలు చేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. పంచాయతీ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.